calender_icon.png 20 September, 2025 | 9:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపూర్ణ ఆరోగ్యంతోనే నిండు జీవితం

20-09-2025 06:50:19 PM

మిడ్జిల్ హెల్త్ క్యాంపులో 138 మంది మహిళలకు పరీక్షలు

జిల్లా వైద్యాధికారి డాక్టర్ సూర్య

మిడ్జిల్: మహిళల ఆరోగ్యం పై దృష్టి పెడితేనే సమాజానికి ప్రయోజనం కలుగుతుందని జిల్లా వైద్యాధికారి సూర్య అభిప్రాయపడ్డారు. శనివారం స్వస్థనారి స్వశక్తి పరివార్ అభినయ్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వస్థనారి అంటే ఆరోగ్యవంతమైన మహిళ అని మహిళా ఆరోగ్యంగా ఉంటేనే ఆమె కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అందుకోసమే ప్రభుత్వం మహిళల ఆరోగ్యంపై దృష్టి పెట్టి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందన్నారు. శిబిరంలో 130 మంది మహిళలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సలు చేసి మందులు ఇచ్చారు.