20-09-2025 06:44:03 PM
తుంగతుర్తి (విజయక్రాంతి): మండల కేంద్రంలోని శ్రీ విద్యా భారతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శనివారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు తీరొక్క పూలతో రంగులతో బతుకమ్మను పేర్చారు. అనంతరం పూజలు చేసి బతుకమ్మ పాటలతో సందడి చేశారు. సందర్భంగా స్కూల్ ప్రధానోపాధ్యాయులు పి మల్లయ్య మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వెంకట గోపాల్. అంబటి రమేష్ రామచంద్రు. అనిత. సునీత. సరిత. ఉమా. స్వప్న. రాధా తదితరులు పాల్గొన్నారు.