13-08-2025 12:00:00 AM
ఎల్లారెడ్డి, ఆగస్టు 12 (విజయక్రాంతి): పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పా లన కొనసాగుతోంది. ఒక్కో అధికారికి రెం డు, మూడు గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ ఇబ్బందికరంగా మారిం ది. పల్లెల్లో పారిశుధ్యం లోపించి అస్తవ్యస్తంగా మారాయి. వీధుల్లో చిన్న గుంత ఏర్పడినా పూడ్చేవారే కరువయ్యారు.
ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది. ఈగలు, దోమల బెడద పెరిగి వ్యాధులు వి జృంభిస్తున్నాయి. పల్లెల్లో పారిశుధ్యం పడకేసింది. సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఒక్కో అధికారికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు ఉండడంతో పర్యవేక్షణ ఇబ్బంది కరంగా మారింది.
గ్రామాల్లో ఏమైనా సమస్యలున్నా చెప్పుదామంటే అధికారులు అందుబాటులో ఉండడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి మండలంలో ప్రత్యేకాధి కారుల పాలనలో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. గ్రామాల్లో సర్పంచ్ల పదవీ కాలం ముగిసినప్పటి నుంచి గ్రామాలను పట్టించుకున్న నాథుడే కరువయ్యాడు. గ్రామాల్లో ఎక్కడ చూసిన చెత్తాచెదారం పేరుకుపోయింది.
పంచాయతీల్లో నిధులు లేకపోవడంతో ప్రత్యేకాధికారులు నామమాత్రంగా పని చేస్తున్నారు. గ్రామాల్లో, పలుచోట్ల వీధి దీపాలు చాలా రోజుల నుంచి వెలగడం లేదు. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో గ్రామాల్లోని పరిస్థితి అధ్వానంగా తయారైంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలనలో, పల్లె, పట్టణ ప్రగతి పేరిట ప్రతినెలా జిల్లాకు రూ.12 కోట్ల నుంచి రూ.16 కోట్లు ఇచ్చి గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతోపాటు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది.
గ్రామాలకు కేంద్రం నిధులు ఇచ్చినా ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఆపలేదు. దాంతో రాష్ట్రంలోని పల్లెలు కొత్త రూపు సంతరించుకు న్నాయి. కానీ.. కాంగ్రెస్ ప్రభుత్వంలో పల్లెలు దారుణంగా మారాయి.
ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్దెనిమిది నెలలు దాటినా ఇటు రాష్ట్రం నుంచి అటు కేంద్రం నుంచి పంచాయతీల కు నిధులు రావడం లేదు. ఇటీవల కాంగ్రెస్ సర్కారు ఎంతో ఆర్భాటంగా స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమం నిర్వహించినప్పటికీ నయాపైసా ఇవ్వకపోవడంతో తూతూ మంత్రంగా జరిగిపోయింది. ప్రస్తుతం ఏ గ్రామానికి వెళ్లినా మురికి గుంతలు, చెత్తా చెదారంతో నిండిన వీధులు, పెరుగుతున్న పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి.
నిధులు లేక ఇబ్బందులు
మండలంలో 31 గ్రామ పంచాయతీలుండగా గ్రామ పంచాయతీలకు నెలనెల రావాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు జమ కాకపోవడంతో జీపీల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. అన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు ఉన్నప్పటికీ వారితో పని చేయించే వారు లేరు. సర్పంచులు లేక, ప్రత్యేకాధికారులు పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్కో కార్యదర్శికి రెండు, మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించడంతో వారు ఏ గ్రామంలో ఉంటున్నారో తెలియని పరిస్థితి ఉంది సర్పంచుల పదవీ కాలం పూర్తయిన తర్వాత పల్లెల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై పడింది. జిల్లాలోని ఆయా పంచాయతీల్లో సెక్రటరీలు చేసిన అప్పులు ఒక్కొక్కరివి రూ.50 వేల నుంచి రూ. లక్షల వరకు ఉన్నట్లు సమాచారం.
ప్రభుత్వం ఇటీవల ఉద్యోగుల బదిలీలకు జీఓ తీసుకురావడంతో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పంచాయతీ సెక్రటరీలు కూడా తమ అర్హతను బట్టి ఎక్కడి వెళ్లాలో వెతుక్కునే పనిలో, పడి బదిలీ అయ్యారు. మరోపక్క బదిలీ అయినా సెక్రటరీలు తాము ఖర్చులు చేసిన బిల్లులు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితి నెలకొందని పలువురు సెక్రటరీలు మదనపడుతున్నారు
అధ్వానంగా డంపింగ్ యార్డులు
రోజు వారీగా చెత్తను తొలగించక పోవడంతో రోడ్లపైనే చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధం వెదజల్లుతోంది. కొన్ని గ్రామాల్లో డంపింగ్ యార్డుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. కొన్ని గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు అందడం లేదు. వీధి దీపాలు ఎప్పుడు వెలుగుతున్నాయో, ఎప్పుడు ఆరిపోతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. సర్పంచులు ఉంటే తాము వారికి సమస్యలు తెలిపిన వెంటనే పరిష్కరించేవారని,
ఇప్పుడు అధికారులు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి ఉందనిప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల బాగోగులు ప్రజా ప్రభుత్వ పాలనలో బాగుపడాలి. అంటే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించి ప్రత్యేక అధికారుల పాలన నుండి స్థానిక సర్పంచ్ల పాలనలోకి చేరితే అధికారులకు ప్రజలకు సమన్వయంగా ఉంటుందని స్థానిక గ్రామ ప్రజలు పలువురు పేర్కొంటున్నారు.
18 నెలలుగా నిధులు లేవు నిధులు లేక ఆందోళనకు గురవుతున్న అధికారులు
గ్రామపంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలనలో పరిపాలన కొనసాగుతుందని ప్రభుత్వం నుండి సమయానికి నిధులు రాకపోవడంతో కొన్ని సందర్భాలలో తమ చేతి నుండి డబ్బులు ఖర్చు చేసి గ్రామపంచాయతీలో పలు అభివృద్ధి పనులు చెత్త ట్రాక్టర్లు గాని త్రాగునీటి సమస్యకు గ్రామాలు గ్రామాలలో మోటార్ల రిపేర్ లు, పైప్ లైన్ మరమ్మత్తులు,
వీధి దీపాలకు, పలు సమస్యలకు పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక అధికారులుగా ఉన్న వారే చేతి నుంచి డబ్బులు ఖర్చు చేసి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైన తర్వాత తీసుకోవడం జరుగుతుందని మండల పరిషత్ అధికారి తెలిపారు. గ్రామ పంచాయతీలకు నిధులు లేక ప్రత్యేక అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.