06-01-2026 05:45:44 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): రోడ్డు భద్రతపై కౌటాల సిఐ సంతోష్ కుమార్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నీతిక పంత్ ఆదేశాల మేరకు హెల్మెట్ ధరించి వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు కౌటాల సిఐ సంతోష్ కుమార్ తెలిపారు. బెజ్జూర్, కౌటాల మండలాలలో రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా తహసిల్దార్ రామ్మోహన్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, ద్విచక్ర వాహనదారులతో కలిసి హెల్మెట్ ధరించి ఎస్ఐ సర్తాజ్ పాషా, ఎస్సై చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వీధుల గుండా అవగాహన ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ... ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని వాహనాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని,అతివేగం ప్రమాదకరమని, రోడ్డు భద్రత గురించి వాహనదారులకు పలు సలహాలు సూచనలు తెలిపారు. రోడ్డు భద్రత నియమాలు పాటిద్దాం, ప్రాణాలను కాపాడుకుందాం అంటూ నినాదాలు చేశారు.