calender_icon.png 8 January, 2026 | 1:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిఐటియు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా జనగాం రాజమల్లు

06-01-2026 05:43:15 PM

ముకరంపుర,(విజయక్రాంతి): విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుంచి ఈనెల 4 వరకు జరిగిన సిఐటియు 18వ జాతీయ మహాసభల్లో జిల్లాకు చెందిన జనగాం రాజమల్లు జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల సిఐటియు జిల్లా కమిటీ పక్షాన జిల్లా కార్యదర్శి గీట్ల ముకుంద రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయ స్థాయిలో బాధ్యత వహించి జనగాం రాజమల్లు రాబోయే రోజుల్లో కార్మిక సంఘాల ఐక్య ఉద్యమాలు చేపట్టాలని, లేబర్ కోడ్స్ రద్దు కోసం, మున్సిపల్ వర్కర్స్ దీర్ఘకాలిక కర్తవ్యాల సాధన కోసం కృషి చేయాలని ఆకాంక్షించారు.