calender_icon.png 23 October, 2025 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం కావాలి

23-10-2025 01:51:54 AM

జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

జనగామ, అక్టోబర్ 22 (విజయక్రాంతి): లింగాల గణపురం మండలం బండ్లగూడెం గ్రామం లో, జరుగుతున్న ఇందిరమ్మ ని ర్మాణాలను బుధవారం కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ పరిశీలించారు. మొత్తం ఎన్ని నిర్మాణాలు ఈ గ్రా మంలో జరుగుతున్నాయి. అని. అవి ఏ ఏ దశలో, ఉన్నాయో అధికారులను అడిగి తెలుసుకుని వాటిని కలెక్టర్ పరిశీలించారు. లబ్ధిదారులు నిర్మాణాలను వేగవంతంగా చేయాలన్నారు.

దశల వారీగా నిర్మాణాలను త్వరగా పూర్తి చేస్తూ.. ప్రభుత్వం అందించే ఆర్ధిక ఆసరా ని.. పొందాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రవీందర్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.