17-10-2025 06:03:32 PM
కొండపాక,(విజయక్రాంతి): ఎంఆర్ఐ గ్రీన్ హెల్త్ 108 సర్వీస్ ఆధ్వర్యంలో కొండపాక మెడికల్ ఆఫీసర్ శ్రీధర్ శుక్రవారం ఆశవర్కర్, ఏఎన్ఎంఎస్ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 108 సిబ్బంది మెడికల్ టెక్నీషన్ మహేందర్, పైలెట్ రమేష్ లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వున్నా ఆశా వర్కర్స్, ఏ ఎన్ ఎం ఎస్ కార్యకర్తలకు ఆపస్మరక పరిస్థితి లో వున్నా వారిని, సిపిఆర్ చేసి ఎలా కాపాడలో అవగాహనా సదస్సు నిర్వహించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా 108 ప్రోగ్రామ్ మేనేజర్ జాన్ షాహిద్, సిద్దిపేట జిల్లా కోఆర్డినేట్ హరి రామకృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎటువంటి అత్యవసర పరిస్థితిలో అయినా 108,102 అంబులెన్స్, అమ్మ ఒడి సేవలను వినియోగించుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆయుష్ డాక్టర్ రజిని, హెచ్ఈఓ రమణ, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.