17-10-2025 05:57:08 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో నిర్వహిస్తున్న బార్ అండ్ రెస్టారెంట్లలో శుక్రవారం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో సిబ్బంది తనిఖీ నిర్వహించారు. పట్టణంలోని అతిధి రెస్టారెంట్, రాయల్ అండ్ బార్ అండ్ రెస్టారెంట్, శ్రావణ్ గ్రాండ్ రెస్టారెంట్లలో తనిఖీలు చేసి కల్తీ ఆహార పదార్థాలను గుర్తించారు. కల్తీ ఆహార పదార్థాలు కలిగి ఉన్న బార్ అండ్ రెస్టారెంట్ల యజమానులకు ఒక్కొక్కరికి రూ పదివేల జరిమానా విధించారు. వీటికి సంబంధించిన ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయనున్నట్లు మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు.