calender_icon.png 6 May, 2025 | 6:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు అవగాహన సదస్సు

06-05-2025 12:19:24 AM

యాచారం, మే 5:  మండలంలో గడ్డమల్లయ్యగూడెం గ్రామంలో మండల అగ్రికల్చర్ అధికారి రవినాథ్ ఆధ్వర్యంలో సోమవారం  రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలురైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  ఏకాద్రీ  డైరెక్టర్ ఆఫ్ ఎక్స్టెన్షన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఎరువుల యాజమాన్యం పై రైతులకు అవగాహన కల్పిస్తూ తక్కువ యూరియా వాడకం పంట సాగు చేయడం సాగుకు అయ్యే ఖర్చు త గ్గించి  అవసరం మేరకు రసాయనాలు వినియోగించి నేలతల్లి ఆరోగ్యానికి కాపాడాలని అన్నారు.

సాగునీటిని ఆదా చేయడం భావితరాలకు అందించడం ముఖ్యమని. రైతులకు వరి రకాలు   యాజమాన్య పద్ధతులు  కొత్తరకం రసాయనాలు, పురుగుమందు ల వాడకం  పై రైతులకు  అవగాహన కలిగించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ రాజేందర్ రెడ్డి ,  మండల వ్యవసాయ అధికారులు రైతులు పాల్గొన్నారు