calender_icon.png 6 May, 2025 | 5:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు కృషిచేయాలి

06-05-2025 12:20:00 AM

కలెక్టర్ ఆదర్శ్ సురభి

వనపర్తి, మే 5 (విజయక్రాంతి) : విద్యుత్ భారాన్ని తగ్గించుకొని ఆర్థిక లాభాన్ని పొందేందుకు గ్రామాల్లో సోలార్ ప్లాంట్‌ల ఏర్పాటుకు కృషిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూ చించారు. సోమవారం కలెక్టర్ చాంబర్లో రెడ్కో, విద్యుత్, లీడ్ బ్యాంక్ మేనేజర్ తో  జిల్లాలో సో లార్ విద్యుత్ ప్లాంట్ పై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ విద్యుత్ వాడకాన్ని తగ్గించుకొని దీర్ఘకాలికంగా ఆదాయం సముపార్జించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ ను ప్రోత్సహిస్తుందని ఈ విషయాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని రెడ్కో యం.డి. మనోహర్ రెడ్డి ని ఆదేశించారు. సోలార్ విద్యుత్ ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం పి.యం. సూర్య ఘర్ , పి.యం. కుసుమ్ పథకాలను అమలు చేస్తుంది. 

5000 గృహాల కంటే ఎక్కువ ఉన్న రెవెన్యూ గ్రామాల్లో మోడల్ సోలార్ విలేజెస్ పోటీలను నిర్వహిస్తుందని, ఏ గ్రామంలో అయితే ఎక్కువ గృహాలు సోలార్ ప్యానెల్ పెట్టుకొని విద్యుత్ ఆదా చేస్తాయో అట్టి గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా సౌర  విద్యుత్ ఉపకరణాలకు రూ. ఒక కోటి అందించడం జరుగుతుంది. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఇన్చార్జి యాదయ్య, రెడ్కో డి.యం. మనోహర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్. ఈ. రాజశేఖర్, డి.ఎల్.పి. ఒ రఘునాథ్, లీడ్ బ్యాంక్ మేనేజర్ సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.