calender_icon.png 24 May, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తల్లిదండ్రులు మరణించిన టాపర్ గా నిలిచిన మొక్కవోని దీక్ష

24-05-2025 12:16:43 AM

ఖానాపూర్,(విజయక్రాంతి):  ఒకరి తర్వాత ఒకరు తల్లిదండ్రులను కోల్పోయిన పుట్టెడు దుఃఖంలో కూడా మొక్కవోని దీక్షతో పదవ తరగతిలో టాపర్గా నిలిచి తన ప్రతిభ కనబరిచిన వుదంతం ఇది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలానికి చెందిన మంత్ర రాజ్యం తేజస్విని అనే విద్యార్థిని తల్లిదండ్రులు ఆమె పదవ తరగతి చదువుతున్నప్పుడు ఒకరి తరువాత ఒకరు మరణించారు. అలాంటి పరిస్థితులు తేజస్వి పరిస్థితులను ఎలా ఎదుర్కొంటుందోనని కుటుంబ సభ్యులు, పాఠశాలలో ఉపాధ్యాయులు భావించారు.

అయితే ఆమె అకుంఠిత దీక్షతో ఎస్ఎస్సి 2025 పరీక్షల్లో 600 మార్కులకు గాను 572 మార్కులతో ఉత్తమ ప్రతిభ కనబరిచి మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలల్లో టాపర్ గా నిలిచి అందరి మన్ననలు అందుకున్నారు. ఈ విద్యార్థినిని శుక్రవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేతులమీదుగా ప్రశంసా పత్రం అందుకుంది. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ,నిర్మల్ శాసనసభ్యులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ,ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ,ఈ కార్యక్రమంలో విద్యార్థిని తేజస్విని ఆశీర్వదించారు. ఇదే పట్టుదలతో భవిష్యత్తులో మరింత మంచి ఫలితాలు సాధించాలని దీవించారు.