17-10-2025 07:19:36 PM
ఘట్ కేసర్,(విజయక్రాంతి): పోచారం మున్సిపల్ అన్నోజీగూడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్న దాదాపు 270 మంది విద్యార్థులకు సీపీఆర్, 108 సర్వీస్ పైన అవగాహన కల్పించడంతోపాటు ఎమర్జెన్సీ సేవలు గుండెపోటు, రోడ్ యాక్సిడెంట్, పాము కాటు, గర్భిణీ స్త్రీలకు, 108 అంబులెన్సును వినియోగించుకోవాలని సూచన ఇవ్వడం జరిగింది. 108 సిబ్బంది ఈఎంటి రమేష్, పైలట్ భద్రు నాయక్ అలాగే స్కూల్ హెడ్ మాస్టర్ ప్రతాపరెడ్డి, టీచర్స్ విద్యార్థులు పాల్గొన్నారు. చాలా విలువైన సూచనలు అందించడానికి అవగాహన సదస్సు ఏర్పాటు చేసినందుకు 108 పైలట్ భద్రు నాయక్, ఈఎంటి రమేష్ లను అభినందించారు.