calender_icon.png 17 October, 2025 | 10:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి

17-10-2025 07:17:08 PM

సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ వేణుగోపాల చారి

రేగొండ,(విజయక్రాంతి): జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని సిజిఆర్ఎస్ చైర్పర్సన్ వేణుగోపాల చారి విద్యుత్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని విద్యుత్ కార్యాలయ ఆవరణంలో ఏర్పాటుచేసిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికకు సీజీఆర్ఎఫ్ గోపాల చారి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గణపురం, భూపాలపల్లి రూరల్, రేగొండ, గోరి కొత్తపల్లి మండలాల నుండి వచ్చిన విద్యుత్తు వినియోగదారులతో మాట్లాడారు. భూపాలపల్లి రూరల్ నుండి ఒకటి, రేగొండ నుండి 2 మేజర్ సమస్యలను గుర్తించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అధికారులు వెంటనే సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్‌ సమస్యల పరిష్కరించడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వినియోగదారుల ఫోరం దృష్టికి తీసుకురావాలని అన్నారు. విద్యుత్‌ పంపిణీలో ఎదురయ్యే సేవాలోపాలను సత్వరమే పరిష్కరించి వినియోగదారుల సమస్యల పరిష్కారానికి వేదికను ఏర్పాటు చేశామన్నారు. ఓవర్‌ లోడ్‌ సమస్యకు ప్రాధాన్యంఇవ్వాలని, సమస్యలు లేకుండా చూడాలని, సర్వీసులను క్రమబద్దీకరించాలని, అవసరమైన చోట స్తంభాలు వేసి కొత్త మీటర్లు ఇవ్వాలన్నారు.