19-09-2025 12:40:17 AM
ఎల్లారెడ్డి సెప్టెంబర్ 18 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రభుత్వం గ్రామ పరిపాలన వ్యవస్థను పునరుద్ధరిస్తూ, గతంలో రద్దు చేసిన వీఆర్వో, వీఆర్‌ఏ వ్యవస్థ స్థానంలో కొత్తగా,గ్రామ పరిపాలన అధికారుల (జీపీవో)ను నియమించింది, అని ఈ నియామకాలకు సంబంధించిన అవగాహన కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయబడుతుంది, దీని ముఖ్య ఉద్దేశ్యం గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను మెరుగుపరచడం, వ్యవస్థను పటిష్టం చేయడం,మే ఈ జిపిఓల అవగాహన సదస్సు అని ఎల్లారెడ్డి ఆర్డిఓ పార్థసింహారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్ అవగాహన సదస్సులో తెలిపారు.
గ్రామ పరిపాలన అధికారి అవగాహన సదస్సులో ఎల్లారెడ్డి తాసిల్దార్ ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ, ఎల్లారెడ్డి మండలంలోని 24 గ్రామపంచాయతీలో, గ్రామ పరిపాలన అధికారుల ప్రాముఖ్యత: రెవెన్యూ వ్యవస్థ బలోపేతం, ఎంతో ముఖ్యమని అన్నారు. గతంలో వీఆర్వో, వీఆర్‌ఏల వ్యవస్థ రద్దు కావడంతో క్షేత్రస్థాయిలో రెవెన్యూ సేవలు మందగించాయి, కనుక గ్రామాలలో ప్రభుత్వం ఈ కొత్త నియామకాలతో రెవెన్యూ సేవలు మళ్లీ గాడిలో పడతాయి, అని జిపి ఓల వ్యవస్థను పునరుద్ధరిచ్చిందని అన్నారు.
గ్రామస్థాయి సేవలు: గ్రామస్థాయిలో రెవెన్యూ సేవలను మెరుగుపరచడం, ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో ఈ అధికారులు కీలక పాత్ర పోషించాలి, అని అన్నారు. ఎల్లారెడ్డి నాయబ్ తహసిల్దార్, ఎం శ్రీనివాస్, రెవిన్యూ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట లింగంపేట మండలాల తాసిల్దార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు ఎంపీడీవోలు ఎల్లారెడ్డి ఎంపీడీవో ప్రకాష్, మూడు మండలాల నూతనంగా నియామకమైన గ్రామ పరిపాలన అధికారులు తదితరులు పాల్గొన్నారు.