19-09-2025 12:40:53 AM
-విజయవంతంగా 200 రోబోటిక్ ఆపరేషన్లు
-ఆస్పత్రి వైద్యులు నవీన్ మాలు, దీప మాలు
హైదరాబాద్, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నోవా లైఫ్ ఆసుపత్రిలో 200 రోబోటిక్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినందున.. గురువారం చికిత్స పొందిన వారితో గురువారం ఆస్పత్రిలో ప్రత్యేక సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ నవీన్ మాలు, దీప మాలు మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా రోబోటిక్ నూతన టెక్నాలజీతో 200 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేసినట్టు తెలిపారు.
కీళ్ల మార్పిడి, జనరల్ శస్త్ర చికిత్సలు, జనరల్ చికిత్స విభాగం, వైద్య నిపుణులు, నెఫ్రాలజీ విభాగంలో అత్యంత సేవలు అందించడంలో వైద్యుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. సమ్మేళనానికి చికిత్స చేయించుకున్న బాధితులు రావడం.. ఆటపాటలతో అందర్నీ అలరించడం సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. ఇంతటి ఆనందానికి కారణం ఆసుపత్రి లో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. నిజామాబాద్ ప్రజలు హైదరాబాద్కు వెళ్లకుండా నోవా ఆసుపత్రిలోనే అతి తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేస్తామని చెప్పారు. హైదరాబాద్ కంటే నోవా ఆస్పత్రిలోనే అత్యుత్తమ నూతన టెక్నాలజీతో ఆపరేషన్లు చేస్తున్నారని బాధితులు చెప్పడం ఎంతో సంతోషం అనిపించింది అన్నారు.