31-12-2025 12:51:05 AM
ఐఐఎంసీ కళాశాలలో నిర్వహణ
హైదరాబాద్, డిసెంబర్ 30 (విజయక్రాం తి): ఐఐఎంసి కళాశాలలో మంగళవారం జాతీ య సేవా పథకం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ పోలీస్ వారిచే ‘జాగృత్ హైదరాబాద్ - సురక్షత్ హైదరాబాద్ ‘ నినాదంతో సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. విద్యావంతులే అధికంగా సైబర్ మోసాల బారి న పడుతున్నారని, అవగాహనతోనే వాటికి అడ్డుకట్ట వేయగలమని ఖైరతాబాద్ ఎస్‌ఐ సందీపరెడ్డి సూచించారు.
ఖైరతాబాద్ సీఐ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్ వలలో చిక్కుకోవద్దని, ఒకవేళ మోసపోయామని గమనించగానే అప్రమత్తమై మొదటి గంటలోనే టోల్ ఫ్రీ నంబరు 1930కి ఫోన్ చేయా లని సూచించారు. వాట్సాప్‌లో ప్రైవసీ ఆప్షన్ ఎంపిక చేసుకోవాలన్నారు. పాత ఫోన్లను ఎవరికీ అ మ్మొద్దని వాటి ద్వారా కూడా డాటా షేర్ అ య్యే ప్రమాదం ఉందన్నారు. ప్రిన్సిపాల్ రఘువీర్ మాట్లాడుతూ విద్యార్థులు సైబర్ మోసా లకు ఆకర్షితులు కాకుండా అవగాహనతో మె లగాలన్నారు. జాతీయ సేవా పథక ప్రో గ్రాం ఆఫీసర్లు రామకృష్ణ, సత్యనారాయణ, అ నిత, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది ఉన్నారు.