31-12-2025 12:49:11 AM
వెంకటేశ్వరస్వామి ఆలయాలకు పోటెత్తిన భక్తులు
నిర్మల్/బెజ్జూర్/మంచిర్యాల, డిసెంబర్ 30 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంతో పాటు వివిధ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం ముక్కోటి ఏకాదశి పండుగలు పురస్కరించుకొని ఉత్తర దార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు.
జిల్లా కేంద్రంలోని దేవరకోట వెంకటేశ్వర స్వామి ఆలయం చిట్యాల వెంకటేశ్వర స్వామి ఆలయం బైంసా సోన్ పొల్కల్ తదితర ఆలయాల్లో ఉదయం నుండి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. దేవరకోటలో మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితో పాటు ప్రముఖులు పూజలు నిర్వహించారు .ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో..
జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలు మం గళవారం ఘనంగా నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని విశ్వనాథ ఆలయంలో మంచిర్యాల ఎంఎల్‌ఏ కొక్కిరాల ప్రేం సాగర్ రావు దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ఈ ముక్కోటి ఏకాదశి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మంచిర్యాల నియోజక వర్గంలో పాడి పంటలతో రైతులు, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సం తోషాలతో ఉండాలని కోరారు.
అలాగే మాజీ ఎంఎల్‌ఏ నడిపెల్లి దివాకర్ రావు, బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమా ర్ విశ్వనాథాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో తాజా మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
బెజ్జూర్ మండల కేంద్రంలో..
బెజ్జూర్ మండల కేంద్రంలోని శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగనాయక స్వామి దేవా లయంలో ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.శ్రీ గోదాదేవి సమేత శ్రీ రంగ నాయక స్వామి వారిని దర్శించుకునేందుకు మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి, కరీంనగర్, మంచిర్యాల, ఆసిఫాబాద్, తదితర జిల్లాల, సిర్పూర్ నియోజకవర్గం లోని వివిధ మండలాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. దీనితో ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి.
అనంతరం హారతి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో ఎంపీడీవో బండారి ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ గాజుల శ్రీనివాస్, సర్పంచ్ దుర్గం సరోజతిరుపతి, కార్యదర్శి వైకుంఠం, కస్తూర్బా గాంధీ ప్రిన్సిపల్ అరుణ, ఆయా శాఖల అధికారులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు తంగేడి పల్లి మహేష్, మాజీ అధ్యక్షులు రాచకొండ శ్రీ వర్ధన్, కొండ్రా జగ్గా గౌడ్, సుధాకర్ గౌడ్, భక్తులు పాల్గొన్నారు.