calender_icon.png 28 July, 2025 | 2:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తుమ్మల చెరువు తూములు తీసిన ఆయకట్టు రైతులు

28-07-2025 12:22:15 AM

అశ్వాపురం, జులై 27,(విజయ క్రాంతి): అశ్వాపురం మండలంలోని కాకతీయుల కా లం నాటి సుప్రసిద్ధ సాగునీటి వనరైన తు మ్మలచెరువులో 14.5 అడుగులు నీరు వచ్చి చేరినందున ఖరీఫ్ సీజన్ కొరకు ఆయకట్టు రైతులు ఆదివారం తూములు తీశారు. తు మ్మల చెరువులో నేటికి నీరు సరిపడు రానందున ఆయకట్టు రైతులు నీటిని వృధా చే యకుండా చివరి భూములకు అందే విధం గా రైతులు సహకరించాలని కోరడం జరిగింది.

తుమ్మల చెరువు కింద గల మూడు ప్రధాన కాలువైన కుందారం,చదలవాడ, ఊరవాయ కాలువల కింద రైతులు కాలువలను శుభ్రంగా చేసుకొని వీటిని వృధా చే యకుండా ఆయకట్టు భూములకు అందే వి ధంగా చూడాలని రైతులకు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మొండికుంట మాజీ సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆయకట్టు రైతులు బద్దం వెంకటరెడ్డి , రణబోతుల రాంరెడ్డి , పులసాని సత్యనారాయణ రెడ్డి, మారాసు సత్యనారాయణ,ముద్దం సైదిరెడ్డి, దండి నాగేశ్వరరావు రైతులుపాల్గొన్నారు.