calender_icon.png 28 July, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దమ్మ తల్లి దేవాలయానికి శంకుస్థాపన

28-07-2025 12:21:10 AM

 వికారాబాద్ జులై 27( విజయక్రాంతి) వికారాబాద్ పట్టణంలోని విద్యానగర్ లో నూతనంగా నిర్మించే పెద్దమ్మ తల్లి దేవాల యం నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి, వికారాబాద్ నియోజకవర్గ శాసనస భ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ఆదివారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భం గా కాలనీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు నరోత్తం రెడ్డి, చక్రవర్తి వేణుగోపాల్, అంబదాసు పంతులు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తదితరులుపాల్గొన్నారు.