calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీఎస్టీ తగ్గింపు ఫలితాలు వినియోగదారులకి అందేలా పర్యవేక్షించాలి

24-09-2025 01:17:36 AM

మాజీ మంత్రి జీవన్ రెడ్డి

జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని తగ్గించడం వల్ల కలిగే ఫలితాలు వినియోగదారునికి అందే విధంగా అధికారుల పర్యవేక్షణ ఉండాలని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఇందిరా భవన్లో మంగళ వారం విలేకరుల సమావేశంల మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం పన్నుల విధానం సరళీకృతం చేయాలని, వినియోగదారుల పై పన్ను భారం తగ్గించాలనే లక్యం తో పన్నుల విధానం రూపొందించారన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైన జీ ఎస్ టి పన్నుల విధానం పై వాస్తవాలను గ్రహించడం సంతోషకరమన్నారు.కేంద్ర ప్రభుత్వం జీ ఎస్టీ పన్నులు ఇప్పుడు తగ్గించామని చెప్తున్నారంటే గతంలో అధిక పన్నుల భారం వేశామని చెప్పకనే చెప్తోందన్నారు. వినియోగదారులు ఎనిమిదేళ్లుగా ఆర్థిక భారం మోస్తున్నారని,జీ ఎస్ టి స్లాబులు 5,18, 40 స్లాబులు గా నిర్ణయించడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు.

ప్రతి వస్తువు పై గతంలో ఎంత రేటు ఉండే ఎంత తగ్గించారనే వివరాలతో దుకాణాల ఎదుట బోర్డు ఏర్పాటు చేయాలన్నారు.జీ ఎస్ టి తగ్గింపు ఫలాలు వినియోగదారునికి అందే విధంగాజిల్లా పరిపాలన యంత్రాంగం పర్యవేక్షించాలని జీవన్ రెడ్డి అన్నారు.పన్నుల్లో రాష్ట్రాలకు 60 % వాటా కేటాయించాలని కోరారు.

క్షేత్రస్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి పెట్రో ఉత్పత్తులపై ఒకే పన్ను విధానాన్ని అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని ప్రతి వ్యాపార సంస్థ ఎదుట నూతన పన్ను విధానం ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బండ శంకర్, దుర్గయ్య, రాజేందర్, చాంద్ తదితరులుపాల్గొన్నారు.