calender_icon.png 24 September, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలు వినియోగించుకోవాలి

24-09-2025 01:16:06 AM

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి 

కరీంనగర్, సెప్టెంబరు 23 (విజయ క్రాంతి): ప్రభుత్వ ఆయుర్వేద వైద్య సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా కరీంనగర్ రామ్ నగర్ లోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లో ఉచిత ఆయుర్వేద మెడికల్ క్యాంపు నిర్వహించారు. రోగులకు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందజేశారు. ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రదర్శనలో ఉంచిన ఆయుర్వేద ఔషధాలను, పలు రకాల ఆయుర్వేద మొక్కలను పరిశీలించారు.

ఇక్కడ యోగా కేంద్రంలో యోగాసనాలను పరిశీలించారు. ఆయుష్మాన్ ఆసుపత్రిని సందర్శించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆస్పత్రిలో ఆరోగ్య మహిళ సహా ప్రభుత్వం నుంచి లభించే ఉచిత వైద్య సేవలు, ఔషధాల వివరాలు తెలియజేయాలని ఆదేశించారు. ఆస్పత్రి ఆవరణను సుభ్రం చేసి మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, యునాని సీనియర్ మెడికల్ ఆఫీసర్ యసబ్ సుల్తానా, డి.పి.ఎం జి.ప్రవీణ్ కుమార్, ఆర్.నీరజ పాల్గొన్నారు.

హైపటైటిస్ వ్యాక్సినేషన్ పరిశీలన వైద్య విధాన పరిషత్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న హైపటైటిస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. అనంతరం ఆస్పత్రిలోనే పలు విభాగాలు సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, ఆసుపత్రి సూపరింటెండెంట్ వీరారెడ్డి, ఆర్.ఎం.ఓ నవీనా, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి సాజితపాల్గొన్నారు.