calender_icon.png 8 November, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మికులకు పెండింగ్‌లో ఉన్న రూ.13 కోట్ల ఎక్స్‌గ్రేషియా వెంటనే విడుదల చేయాలి

08-11-2025 12:00:00 AM

గీతా పనివారల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పల్లె శంకరయ్య గౌడ్ 

చండూరు, నవంబర్ 7 (విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రధామావ శాత్తు చెట్ల పైనుంచి పడి మరణించిన  కల్లు గీత కార్మికులకు చెల్లిం చాల్సిన రూ. లు 13 కోట్ల ఎక్స్గ్రేషి యో బకాయిలను వెంటనే విడుదల చేయాలని జిల్లా సహాయ కార్యదర్శి పల్లె శంకరయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం చండూరు ఎక్సైజ్ కా ర్యాలయంలో ఆప్కారి సీఐ పద్మ ను కలిసి వివిధ డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా శంకరయ్య గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికులందరికీ వృత్తి రక్షణ కవచాలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. గీత వృత్తిలో పనిచేస్తూ చనిపోయిన కుటుంబాలకు ఎక్స్గ్రేషియోను 5 లక్షల నుండి 10 లక్షలకు పెంచి, తాత్కాలిక గాయాలతో బాధితులైన వారికి రెండు చెల్లించాలని,మెడికల్ బోర్డు విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ సివిల్ అసిస్టెంట్ సర్జన్ పర్యవేక్షణలో శాశ్వత వికలాంగుల నిర్ధారణ సర్టిఫికెట్ పద్ధతిని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

రాష్ట్రంలోని అన్ని కళ్ళుగీత సహకార సంఘాలు, టి ఎఫ్ టి లకు శాశ్వత లైసెన్స్ అర్హులైన అందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గీత పనివారల సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు గంట నగేష్, కర్నాటి వెంకటేశం, మల్లేశం, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.