25-03-2025 12:00:00 AM
ప్రారంభించిన ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో ఏర్పాటు చేసిన ఆయుష్మాన్ రిహాబిలిటేషన్ కేంద్రాన్ని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎల్‌బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధునాతన పరికరాలతో ఈ సెంటర్‌ను ప్రారంభించిన నిర్వాహ కులు డా.జీవికేఆర్‌గౌడ్, డా. ఎమ్ రాజేందర్‌రెడ్డి, డా. బి విజయ్‌కుమార్, డా. కే కిషోర్‌రెడ్డిలకు శుభాకాంక్షలు తెలిపారు.
పేదవారికి మానవతా దృక్పథంతో సేవ వారు కోరారు. రిహాబిలిటేషన్ సెంటర్ ద్వారా ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యాన్ని అందించి ఆరోగ్యాన్ని రక్షించే వి వారికి భరోసా కల్పించాలని అన్నారు.
జీవీకేఆర్ గౌడ్ మాట్లాడుతూ వైద్యం అందరికీ అందుబాటులోనే ఉంటుందని, పేద మధ్యతరగతి కుటుంబాలకు అన్ని రకా వైద్య సేవలు అందిస్తామని, పక్షవాతం వ వారికి, కాళ్లు చేతులు పడిపోయిన వా ఎలాంటి యాక్సిడెంట్లు అయినా ఆర్దో ఫిజీషియన్ 24 గంటలు డాక్టర్లు అందుబాటులో ఉంటారని చెప్పారు.
కార్యక్రమంలో డాక్టర్ రాజేందర్ కుమార్, డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ కృష్ణారెడ్డి, వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వర్‌రెడ్డి, సామ రంగారెడ్డి, ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, వనిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, బండి దీక్షిత్ పాల్గొన్నారు.