calender_icon.png 6 May, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి

25-03-2025 12:00:00 AM

ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ.చంద్రశేఖర్

ముషీరాబాద్, మార్చి 24: (విజయక్రాంతి):  కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భం గా రవాణా రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ఐఎన్‌టీ యూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం నారాయణగూడ చౌరస్తాలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి. సంజీవరెడ్డి  పిలుపు మేరకు ఐఎన్‌టీయూసీ ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్  రాష్ట్ర అధ్యక్షులు ఎ.నరసింహారెడ్డి, ప్రధాన కార్యదర్శి గోదా మల్లేష్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బిజ్జల రామకృష్ణారెడ్డి, నేతృత్వంలో ఐఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌డీ. చంద్రశేఖర్ సమక్షంలో నారాయణగూడ చౌరస్తాలో ప్ల- కార్డులను చేత బూని నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్మికుల కృషి ఎంతో ఉన్నదని, ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఏర్పడి16 నెలలు గడిచినప్పటికీ ఇంతవరకు అమలు చేయలేదని, వాటి విధానాలు రూపొందించలేదని అన్నా రు. ప్రభుత్వ హామీలు అమలుకు పూనుకోవాలని, లేని యెడల  రాష్ట్రవ్యాప్తంగా నిరస న తెలియజేస్తామని  ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ క్యాబ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల ఉపేందర్, ఆటో యూనియన్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఎస్. దయానంద్, ఆటో యూనియన్ నాయకులు అంబదాసు, నాగరాజు, నాగ మల్లయ్య జానయ్య, కనకయ్య, క్యాబ్ యూనియన్ నాయకులు రఫీ, నగేష్ తదితరులు పాల్గొన్నారు.