05-04-2025 05:40:31 PM
దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం..
జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): స్వాతంత్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి బాబూ జగ్జీవన్ రామ్ జీవితం స్ఫూర్తిదా యకమని, దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కొనియాడారు. శనివారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. బాబు జగ్జీవన్ రావ్ చిత్రమటానికి పూలమాలవేసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... అత్యంత పేదరి కంలో జన్మించిన బాబూజీ అకుంఠిత దీక్షతో అత్యున్నత స్థానానికి ఎదిగారని పేర్కొన్నారు. జాతీయోద్య మంలో పాల్గొన్న బాబూజీ రాజ్యాంగ పరి షత్ సభ్యుడిగా సేవలందించారని, స్వాతంత్య్రానంతరంతొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో తొలి కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించి కార్మిక సంక్షేమానికి పాటుపడ్డారన్నారు.
కార్మిక పక్షపాతిగా గుర్తింపు పొందిన బాబూజీ రెండు దఫాలు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా సేవలు అందించారని కలెక్టర్ తెలిపారు. దేశవ్యాప్తంగా కరవు తాండవిస్తున్నప్పుడు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవం విజయవంతంలో కీలక పాత్ర పోషించారని, రైల్వే, జాతీయ రవాణా శాఖ మంత్రిగా బాబూజీ తనదైన ముద్ర వేశారని, అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు బాబూజీ పోరాడారని, దళితుల అభ్యున్నతికి ఎంతగానో పాటుపడ్డారని కలెక్టర్ పేర్కొన్నారు. బాబు జగ్జీవన్ రావు జీవితాన్ని ప్రజలు స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనప కలెక్టర్ డి వేణుగోపాల్, జిల్లా ఎస్సీ డెవలప్మెంట్ అధికారి అనసూర్య, జిల్లా మైనార్టీ వెల్ఫేర్ శాఖ అధికారి సంజీవరావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి రమాదేవి, వైద్యశాఖ అధికారి భాస్కర్ నాయక్, జిల్లా అధికారులు, అన్ని శాఖల సిబ్బంది, కాకెళ్లి సైమన్ కమిటీ కన్వీనర్, బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.