14-09-2025 12:09:41 AM
రోడ్డు పాలైన అమ్మ
మహబూబాబాద్, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): ఐదుగురు కూతుళ్లు ఉన్నా అ అమ్మ ఆనాథ అయింది. కడుపున పుట్టిన బిడ్డలే ఆమెను వీధి పాలు చేశారు. కనిపెంచి పెద్ద చేసి, ఉన్న ఆస్తి అంతా అమ్మి పెళ్లిళ్లు చేసి భవిష్యత్తును తీర్చిదిద్ది అవసాన దశలో ఉన్న కన్నతల్లికి వారు ఆసరా ఇవ్వలేకపోయారు. ఈ సంఘటన శనివారం మహాబూ బాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం గున్నేపల్లిలో చోటు చేసుకుంది.
గున్నేపల్లి గ్రామా నికి చెందిన రామగిరి సోమక్కను రోడ్డుపై వదిలేసిన కూతుర్లు బుక్కెడు బువ్వ పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదని ఆ తల్లి కనిపించిన ప్రతి ఒక్కరికి తన గోడు వెళ్ల్లబోసుకుంది. రోడ్డు మీద ఒక బెంచ్ పై తన దీనస్థితిని వివరిస్తూ రోదిస్తున్న తల్లి హృద య విధారకమైన ఘటన చూసి పలువురు చలించి పోయారు.
ఐదుగురు బిడ్డలు ఉన్నప్పటికీ మరో బిడ్డ సొంత ఊర్లోనే ఉంటుం డగా, ఎప్పటికీ నేనే తల్లిని పోషించాలా అంటూ విసుక్కోవడంతో ఆ అమ్మ మరో దారి లేక రోడ్డుపై ఉన్న బెంచినీ ఆసరా చేసుకొని జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో స్పందించిన గ్రామస్తులు గ్రామంలో ఉన్న కూతురుకు నచ్చజెప్పి తల్లిని తిరిగి ఇం టికి తీసుకు వెళ్లేందుకు అంగీకరింపజేశారు.