calender_icon.png 24 November, 2025 | 7:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెదురు సాగు.. రైతుల ఇంట సిరుల పంట

11-02-2025 12:00:00 AM

కలెక్టర్ జితేష్ వి.పాటిల్

భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : వెదురు సాగు చేయడం వల్ల రైతుల ఇంట సిరుల పంట పండి నట్టేనని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయం మినీ సమావేశ మందిరంలో ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌం డేషన్ వారి ఆధ్వర్యంలో చుండ్రుగొండ, ములకలపల్లి గుండాల మండలాల ఏపిఎం లు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్‌పిసీలు, వివో ఏసీలు, అటవీ శాఖ సిబ్బంది కి వెదురు పెంపకంపై శిక్షణా తరగతులు నిర్వహిం చారు.

ఈ శిక్షణ తరగతులకు కలెక్టర్ జితేష్ వి.పాటిల్ పాల్గొన్నారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 6. 18 లక్షల వెదురు సాగు లక్ష్యాన్ని ఖచ్చి తంగా చేరుకోవాలని, అందుకుగాను ఇండస్ట్రీస్ క్రాఫ్ట్ ఫౌండేషన్ వారు మన జి ల్లాలో వెదురు సాగు చేయడానికి సులభ మైన పద్ధతులు, వివిధ రకాల వెదురు సాగు, వెదురు సాగు వల్ల ఉపయోగాలు, వెదురు ఉత్పత్తులు తదితర వాటి మీద రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహిం చడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో చండ్రుగొండ, ములకలపల్లి, గుండాల మండలాలలోని భూములు వెదురు సాగు కు ఎంతో అనుకూలమని, అదేవిధంగా సాగుకు అవసరమైన నీటి వసతులు పుష్క లంగా ఉన్నాయన్నారు. ఎవరైతే ఐదు ఎక రాల వ్యవసాయం చేస్తూ బోరు సౌకర్యం వున్నఅటువంటి రైతులు ఒక ఎకరం వెదురు సాగు చేపట్టే విధంగా రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

పెద్ద రైతులు వారికున్న భూముల్లో ఒక ఎకరం చిన్న రైతులు అర ఎకరం లోనైనా వెదురు సాగు చేపట్టాలని దాని ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందుతారు అన్నారు. మునగ, వెదురు సాగు అన్ని సమస్యలకు పరిష్కా రమని కలెక్టర్ అన్నారు. మునగ సాగు ద్వారా స్వల్ప కాలంలోనే ఆదాయం సమ కూరుతుందని, వెదురు సాగు ద్వారా ఎఫ్ డిలా ఒక్కసారి పెట్టుబడితో నిరంతర ఆదాయం చేకూరుతుందన్నారు.

వెదురు ను ఉపయోగించి కేవలం ఫ్లోరింగ్, ప్యాన లింగ్ మాత్రమే కాకుండా ఇప్పుడు థర్మల్ విద్యుత్ కేంద్రాలలో బొగ్గు వినియోగంతో ఎక్కువ వాయు కాలుష్యం ఏర్పడుతుం దని, దానికి బదులు వెదురు గుళికలు వినియోగించడం జరుగుతుంది అన్నారు. తద్వారా థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీ గా వెదురు గుళికలు అవసరం పడుతు న్నాయని, ఈ అవసరమే వెదురు సాగును లాభాల బాటలో నడిపించనుంది అని తెలిపారు.

అంతేకాకుండా నంద్యాలలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ వారు వెదురు కొనుటకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. జిల్లాలో జామాయిల్ సాగుకు సమానంగా వెదురు సాగు చేపట్టాలని, ఆ దిశగా అధికా రులు రైతులకు అవగాహన కల్పించాల న్నారు. జిల్లాలోని ఆదివాసీల అభివృద్ధికి వెదురు సాగు ఒక్కటే మార్గమని వెదురు సాగు ద్వారా ఆదివాసీల సాంప్రదాయ వస్తువుల తయారీ చేపట్టవచ్చని, అదేవిధం గా పోడు వ్యవసాయంలో వెదురు సాగు చేపట్టేలా  అటవీశాఖ అధికారులు ఆదివా సీలను ప్రోత్సహించాలని అన్నారు. 

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, ఉద్యాన వన శాఖ అధికారి కిషోర్, ఇండస్ట్రీ క్రాఫ్ట్ ఫౌండేషన్ ప్రోగ్రాం మేనేజర్ రమ్య, డాక్టర్ శ్రీకాంత్, ఆపరేషన్ మేనేజర్లు అమృత, అక్షయ్, టెక్నికల్ మేనేజర్ కుసుమ కుమారి, మూడు మండలాల వివిధ శాఖల  శాఖ అధికారులు, అటవీ శాఖ అధికా రులు, ఏపీఎంలు, ఏపీవోలు, సీసీలు, ఎఫ్‌పిసిలు, వీవో, ఏసీలు మరియు సంబం ధిత అధికారులు పాల్గొన్నారు.