calender_icon.png 24 November, 2025 | 6:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులపై శ్రద్ధ చూపకుంటే చర్యలు

11-02-2025 12:00:00 AM

  • జనంపల్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపల్‌కు షోకాజ్ నోటీస్ 
  • విద్యార్థులతో దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు:కలెక్టర్ హెచ్చరిక

యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 10 (విజయ క్రాంతి):  విద్యార్థులపై శ్రద్ధ వహించని, పాఠశాల పరిసర ప్రాంతాలలో శుభ్రత పాటించని వారి క్రమ శిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సోమవారం రామన్నపేట మండలం లోని జనంపల్లి గ్రామంలో గురుకుల పాఠశాలలో ఆదివారం నాడు జరిగిన పేరెంట్స్ మీటింగ్‌లో జరిగిన సంభాషణ, నిరసన  సంఘటనల పై జిల్లా కలెక్టర్ సోమవారం నాడు పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్  విద్యార్థుల సౌకర్యాలు, వారిపై   నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలను అక్కడ పరిస్థితులను కలెక్టర్ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు  సౌకర్యాలు సరిగా లేవని చూపడంతో, కోతుల బెడద ఉందని, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా లేదని, డైనింగ్ హాల్ పరిశుభ్రంగా లేకపోవడంపై  కలెక్టర్ ప్రిన్సిపాల్, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పద్ధతి మారకపోతే చర్యలు తప్పవంటూ ప్రిన్సిపల్కు షో కాల్స్ నోటీస్ జారీ చేశారు.

విద్యార్థులకు అందించే  ఆహారంకు సంబంధించిన కూరగాయల షెడ్‌ను , వంటకు వాడుతున్న కందిపప్పు, నూనె, కోడిగుడ్లు, తదితర సరుకులను పరిశీలించి నాణ్యమైన , రుచికరమైన భోజనం అందించాలని,  త్రాగు నీటి ట్యాంకు రోజు శుభ్రం  చేస్తూనారా లేదా కలెక్టర్ స్వయంగా ట్యాంకు ఎక్కి పరిశీలించి ఎప్పటికప్పుడు ట్యాంకు శుభ్రంగా ఉండాలని తెలిపారు.

ఎంపీడీవో , తహశీల్దార్ ఆధ్వర్యంలో పాఠశాల పరిధిలో  మంగళవారం నాడు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ గ్రామ పంచాయతీ సిబ్బందితో నిర్వహిస్తామని, అంతేకాకుండా పెద్దఎత్తున మెడికల్ క్యాంపు  ఏర్పాటు చేయడం జరుగుతుందని , ప్రతి ఒక్క విద్యార్థిని స్క్రీన్ చేస్తూ వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. పాఠశాల సిబ్బంది విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ఇదే చివరి అవకాశమని కలెక్టర్ హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డిఓ శేఖర్ రెడ్డి, తహశీల్దార్, ఎం. పి. డి. ఓ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.