03-05-2025 10:08:58 PM
రామకృష్ణాపూర్ (విజయక్రాంతి): జమ్మూ కాశ్మీర్ పహల్గంలో హిందువులపై ఉగ్రవాద మూకల చేసిన హత్య ఖండనకు నిరసనగా శనివారం రామకృష్ణాపూర్ పట్టణంలోని వ్యాపారులు స్వచ్చందంగా బంద్ కు పిలుపునిచ్చారు. కాశ్మీర్ లోని పహల్గాంకి విహారయాత్రకు వెళ్లిన వారిని మతం పేరుతో విభజించి, ఒక వర్గం వారిని లక్ష్యంగా చేసుకుని హతమార్చిన ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ప్రపంచమంతా ఖండిస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. పట్టణంలో రామాలయం, సూపర్ బజార్, రాజీవ్ చౌక్, సెంటర్ లో బంద్ ప్రశాంతంగా ముగిసింది.