03-05-2025 10:05:20 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ పరిధిలో నూతన నిర్మించిన ప్రభుత్వ హాస్పిటల్ భవనాన్ని, ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాల పనులను శనివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ... తాను చదువుకున్న స్కూల్, కళాశాల భవనాన్ని కట్టించడం నా అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.