09-01-2026 12:17:49 AM
భైంసా, జనవరి ౮ (విజయక్రాంతి): కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ శుక్రవారం ముథోల్ నియోజకవర్గం లో పర్యటించనున్నారు. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముధోల్ నియోజకవర్గం లోని బైంసా మున్సిపాలిటీ బిజెపి కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు అనంతరం బిజెపి సర్పంచ్ వార్డు సభ్యులను సన్మానం చేయనున్నారు బండి సంజయ్ పర్యటన నేపథ్యంలో బైంసా పట్టణంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు 2023లో వచ్చిన బండి సంజయ్ కేంద్ర హోంశాఖ మంత్రిగా తొలిసారిగా రానున్నారు.