09-01-2026 12:18:52 AM
మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నరసింహారావు
ఎర్రుపాలెం, జనవరి 8 (విజయ క్రాంతి): మహిళల అభివృద్ధి కొరకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యంగా పనిచేస్తుందని మధిర మార్కెట్ కమిటీ చైర్మన్ బండా నరసింహారావు పేర్కొన్నారు.మండల కేంద్రంలోని రైతు వేదిక నందు గురువారం నాడు కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీ చేశారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వీటిని పంపిణీ చేశారు. మండల వ్యాప్తంగా ఈ పథకాలకు చెందిన లబ్ధిదారులకు 115 మంది కి చెక్కులు పంపిణీని చేశారు.
వీటి విలువ సుమారు 3,99,46,284 రూపాయల చెక్కులను మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు చావా రామకృష్ణ, మండల తహసిల్దార్ మన్నే ఉషా శారదతో కలిసి లబ్ధిదారులకు అందించారు. తదనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో చైర్మన్ బండారు నరసింహారావు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృ ద్ధి ప్రదాత ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో రాష్ట్రంలో మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెడు తున్నారని మహిళల అభివృద్ధికి, సాధికారత సాధించాలని లక్ష్యంగా పనిచేస్తున్నారని , వారి అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని పేర్కొన్నారు.
రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను ముఖ్యంగా మధిర నియోజవర్గంలో పెద్ద ఎత్తున మహిళల కొరకు సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్నారని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ఉపయో గించుకొని మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సారధ్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నారని, వీటిని మహిళలందరూ ఉపయోగించుకొని అభివృద్ధి సాధించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు చావా రామకృష్ణ మాట్లాడుతూ ఉపముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క నాయకత్వంలో నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఎర్రుపాలెం సర్పంచ్ నండ్రు అశ్విని, ఉప సర్పంచ్ ఎస్.కె శభాష్ ఎర్రుపాలెం టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్.కె ఇస్మాయిల్, మల్లెల లక్ష్మణరావు, కంచర్ల వెంకట నరసయ్య, దేవరకొండ రాజీవ్ గాంధీ, 31 గ్రామాల సర్పంచులు, మార్కెట్ కమిటీల, ఆత్మ కమిటీల డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు , పార్టీ అనుబంధ సంఘాల కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ నాయకులు మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.