calender_icon.png 23 November, 2025 | 6:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్ నాస్తికుడు.. కేంద్రమంత్రి బండి సంజయ్ ధ్వజం

27-07-2024 03:46:07 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కాళేశ్వరం ఆలయ సంప్రదాయాలు పాటించకుండా బీఆర్ఎస్ నేతలు గర్భగుడిలోకి వెళ్లడం దుర్మార్గమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. శనివారం బండి సంజయ్ కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కేటీఆర్ నాస్తికుడని, హిందూ సనాతన ధర్మాన్ని అవమానించేలా వ్యవహరిస్తున్నడని ధ్వజమెత్తారు. దేవుడిని అవమానించడం తప్ప బీఆర్ఎస్ నేతలు సాధించిందేమిటని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు తక్షణమే తెలంగాణ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేశారు.