24-10-2025 01:04:25 AM
వన్డే సిరీస్ కైవసం
ఢాకా, అక్టోబర్ 23 : అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్ ఆటతీరు నానాటికీ దిగ జారుతోంది. తాజాగా బంగ్లాదేశ్ చేతిలో వన్డే సిరీస్ ఓటమిని చవిచూసింది. సిరీస్ డిసైడర్‌గా మారిన మూడో వన్డేలో బంగ్లా ఆటగాళ్ళు సమిష్టిగా రాణించి విండీస్‌కు షాకిచ్చారు.బంగ్లాదేశ్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టి వన్డే సిరీస్‌ను 2 కైవసం చేసుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 296 పరుగులు చేసింది. సైఫ్(80), సౌమ్యా సర్కార్(91). శాంటో(44) పరుగులతో రాణించారు.
అఖిల్ హొస్సేన్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఛేజింగ్‌లో వెస్టిండీస్ జట్టు ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది. బం గ్లా బౌలర్ల దెబ్బకు కేవలం 117 పరుగులకే కుప్పకూలింది.రెండో వన్డేలో అద్భుతంగా పోరాడి సూపర్ ఓవర్‌లో గెలిచిన విండీస్ చివరి మ్యాచ్‌లో మాత్రం చేతులెత్తేసింది. నసుమ్ 3/11, రిషద్ 3/54, మిరాజ్ 2/35, తన్వీర్ 2/16 రాణించారు. తొలి వన్డేలోనూ వెస్టిండీస్ చిత్తుగా ఓడిపోయింది. ఇరు జట్ల మధ్య మూడు టీ ట్వంటీల సిరీస్ అక్టోబర్ 27 నుంచి మొదలవుతుంది. బంగ్లా చివరిసారిగా 2024లో శ్రీలంకపై సిరీస్ గెలి చింది.. సౌమ్యా సర్కార్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, రిషద్ హొస్సేన్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు లభించాయి.