calender_icon.png 8 August, 2025 | 4:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలి

08-08-2025 01:32:43 AM

జనగామ, ఆగస్టు 7 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో బంజారా సమాజానికి సరైన ప్రాతినిధ్యం కల్పించాలంటూ సేవాలాల్ సేన నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్లో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సేవాలాల్ సేన రాష్ట్ర ఉపాధ్యక్షులు భానోత్ మహేందర్ ఆదేశాల మేరకు ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించబడింది .

ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షుడు దరావత్ శంకర్ నాయక్ అధ్యక్షత వహించారు. వివిధ మండలాల నుండి నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తెలంగాణలో లక్షలాది మంది బంజారాలు ఉన్నా ఇప్పటి వరకు ఒక్క మంత్రి పదవిని కూడా ఇవ్వకపోవడం దురదృష్టకరం కాంగ్రెస్ ప్రభుత్వం బంజారాల పట్ల విభేదభావంతో వ్యవహరిస్తోందని ఆరోపించారు. తక్షణమే బంజారా సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

వచ్చే నెలలో జరిగే రాష్ట్రస్థాయి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. తండాల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. సంఘ బలోపేతానికి ప్రతి తండాలో సేవాలాల్ సేన కమిటీలు ఏర్పాటు చేయాలని  గ్రామ స్థాయిలో సంఘాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.

నూతన కార్యకర్తలను ప్రోత్సహిస్తూ, బంజారా సమాజాన్ని రాజకీయంగా చైతన్యపరిచేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు.ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ధరావత్ బిక్షపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ధరావత్ రమేష్, యువజన జిల్లా అధ్యక్షుడు తేజావత్ మోహన్, రైతు సేన జిల్లా అధ్యక్షుడు మూడవత్ రాజు నాయక్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ధరావత్ ప్రకాష్, అనిల్ చౌహన్,  శ్రీనివాస్,  అశోక్ ,భీమ్ సింగ్ తరిగపుల స్వభావత్ అలపతి,  ధరావత్ రవి,  రాజేందర్, బానోతు సుమన్, గ్రామ కమిటీ నాయకులు మోహన్ సురేష్ , తదితరులు పాల్గొన్నారు.