calender_icon.png 8 August, 2025 | 4:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాధాన్యతాక్రమంలో పేదలకు సంక్షేమ పథకాల వర్తింపు

08-08-2025 01:32:55 AM

గజ్వేల్‌లో రూ.16 లక్షల  సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన 

మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి

గజ్వేల్, ఆగస్టు 7 :  ప్రాధాన్యత క్రమంలో పేదలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నామని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల పంపిణీ నిరంతరంగా కొనసాగుతుందని  డిసిసి అధ్యక్షులు, గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూ%ళి%కుంట నర్సారెడ్డి పేర్కొన్నారు. గురువారం గజ్వేల్ లో రూ 15,73,500 లక్షల విలువచేసే సిఎంఆర్‌ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు సైతం కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యం కాగా, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని రూ 10 లక్షలకు పెంచినట్లు గుర్తు చేశారు. 

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జిల్లా సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తుండగా, ఇప్పటికే జిల్లాలో రూ 950 కోట్ల విలువచేసే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేసినట్లు స్పష్టం చేశారు. అలాగే 3967 రేషన్ కార్డులు అందజేయగా, పాత రేషన్ కార్డులలో 11 వేల మంది  అరులైన వారిని గుర్తించి నమోదు చేసినట్లు చెప్పారు. పదేండ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూసిన పేదలకు న్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందని అన్నారు.

గజ్వేల్ అభివృద్ధికి అడిగిన అన్ని నిధులు కేటాయిస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి రుణపడి ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు కరుణాకర్ రెడ్డి, యాదగిరి,  కొండపోచమ్మ టెంపుల్ డైరెక్టర్ గుండు లక్ష్మణ్, మాజీ సర్పం సుఖేంధర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ అంజి యాదవ్, కొండల్ రెడ్డి, శివారెడ్డి, గుంటుకు శ్రీనివాస్,  శ్రీనివాస్ రెడ్డి, శివులు, అజ్గర్, దాత్తర్ పల్లి లక్ష్మణ్, కన్న యాదవ్, డప్పు గణేష్, దాయాల యాదగిరి, సురేష్, చెప్పాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.