24-07-2025 01:12:25 AM
కోఠీ బ్యాంక్ స్ట్రీట్‌లో ప్రారంభం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 23 (విజయక్రాంతి): హైదరాబాద్ కోటిలోని బ్యాంక్ స్ట్రీట్‌లోని 1వ అంతస్తులో బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ స్ట్రీట్ బ్రాంచీని బుధవారం హైదరాబాద్ జోన్ జనరల్ మేనేజర్, జోనల్ హెడ్ రితేష్ కుమార్, బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో ప్రారంభిం చారు. కొత్త బ్రాంచీలో కస్టమర్‌లకు మెరుగైన సౌకర్యాలు అందజేయనున్నట్టు వారు తెలిపారు. కస్టమర్ సేవా శ్రేష్ఠతకు తాము నిరంతరం నిబద్ధతతో పనిచేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బ్రాంచ్ హెడ్, చీఫ్ మేనేజర్ అనురాగ్ దీప్, మురళీ కృష్ణ రాయప్రోలు (డిజిఎం-బిజినెస్ డెవలప్మెంట్, హైదరాబాద్ జోన్), ఆదిత్య కుమార్ కన్నౌజియా (డిజిఎం, రీజినల్ హెడ్-హైదరాబాద్ మెట్రో రీజియన్), రవి హెచ్‌జి (డిజిఎం, రీజినల్ హెడ్-తెలంగాణ సౌత్ రీజియన్), జపత్ సింగ్ ప్రవాకర్ (ఎజిఎం, డిఆర్‌ఎం-హైదరాబాద్ మెట్రో రీజియన్) పాల్గొన్నారు.