23-09-2025 12:00:00 AM
-విజిట్ వీసాల పేరిట లక్షలు దండుకుంటున్న వైనం
-ఇజ్రాయిల్‌లో ఉద్యోగాల పేరుతో మోసం
-న్యాయం చేయాలని గద్వాల ప్రజావాణిలో బాధితుల ఫిర్యాదుతో వెలుగులోకి..
-ఏపీలోని సక్కినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదులు
గద్వాల, సెప్టెంబర్ 22: ఇజ్రాయిల్‌లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని నమ్మించి ఓ చర్చి ఫాదర్.. వీసాల కోసమంటూ వారి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. అతడ్ని నమ్మి ఇజ్రాయిల్ వెళ్లిన బాధితులకు అక్కడ ఉద్యోగాలు దొరక్కపోవడంతో మోసపోయామని గ్రహించి తిరిగి ఇండియా చేరు కున్నారు. చర్చి ఫాదర్‌పై చర్యలు తీసుకోవాలంటూ గద్వాల ప్రజావాణితో పాటు ఏపీ లోని సక్కినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన బాలక్రిష్ణ, ప్రసాద్, చిట్టిబాబు, ప్రభుదాస్, భార తీ, సునీల్, రత్నకుమారి, బేబి కిషోర్, విజ య్ మోహన్, పద్మతో పాటు మరికొందరిని ఇజ్రాయిల్‌లో ఉద్యోగాలు అంటూ గద్వాల జిల్లా ధరూర్ మండలానికి చెందిన ఓ చర్చి ఫాదర్ సుదర్శన్ అలియాస్ అబ్రహం నమ్మించాడు. విజిట్ వీసా పేరుతో ఇజ్రాయిల్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, ఒక్కొ క్కరి నుంచి రూ.8 నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేశాడు. జూన్ 9, 2024లో కోనసీమ జిల్లాకు చెందిన మొత్తం 42 మందిని టూరిస్ట్ వీసా పేరుమీద ఇజ్రాయిల్‌కు తీసుకెళ్లాడు.
అక్కడ కొన్ని ప్రదే శాలు చూసిన తర్వాత అక్కడే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పాడు. కొంత కాలం తర్వాత ఆ దేశం అధికారులు టూరిస్ట్ వీసా మీద వెళ్లిన వారిని కూడా తిరిగొచ్చారు. వీసా, టికెట్ ఖర్చులు పోగా మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వాలని సుదర్శన్‌పై ఒత్తిడి తేవడంతో వారికి చెక్కులు అందజేశాడు. బ్యాంకు ఖా తాలో డబ్బులు లేకపోవడంతో అవి బౌన్స్ అయ్యాయి.
తిరిగి నిలదీయగా.. “ఎవరికైరా చెప్పుకోండి. నేనేది ఇచ్చేది లేదు” అంటూ బాధితులపై బెదిరింపులకు పాల్పడటంతో వారం రోజుల నుంచి ధరూర్ మండల కేంద్రంలోని చర్చిలో ఉంటున్నారు. అయి నా సుదర్శన్ డబ్బులు ఇవ్వకపోవడంతో గద్వాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. అంతకుముందు ఏపీలోని సక్కినేటిపల్లి పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశారు.