calender_icon.png 23 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 110 ఫిర్యాదులు

23-09-2025 01:23:21 AM

కామారెడ్డి, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 110 ఫిర్యాదులు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగు వాన్ తెలిపారు. సోమవారం కామారెడ్డి కలెక్టరేట్లో అర్జీ దారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజావాణి  కార్యక్రమం దోహద పడుతుందని అన్నారు.   

బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను  ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి పలువురు అర్జిదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. అర్జిదారులకు న్యాయం చేసి తిరిగి అర్జి పెట్టుకోకుండా పని చెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి.. 

నిజామాబాద్, సెప్టెంబర్ 22 :(విజయ్ క్రాంతి):  ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 89 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్లు అంకిత్,

కిరణ్ కుమార్ తో పాటు, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, మెప్మా పీడీ రాజేందర్, ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డిలకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, ఫిర్యాదులను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.