calender_icon.png 23 July, 2025 | 8:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులు రుణాలు పొందుటకు బ్యాంకర్లు సహకరించాలి

22-07-2025 10:14:38 PM

రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క..

ఏటూరునాగారం (విజయక్రాంతి): రైతులు రుణాలు పొందుటకు బ్యాంకర్లు సహకరించాలని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. మంగళవారం ఏటూరునాగారం మండల కేంద్రంలో డిసిసి బ్యాంకు ఏటూరునాగారం బ్రాంచి నూతన భవనమును మంత్రి ధనసరి అనసూయ సీతక్క, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) చైర్మన్‌ మార్నేని రవీందర్‌రావు ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, ఏ ఎస్ పి శివం ఉపాధ్యాయ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి లతో కలసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. మన ప్రభుత్వం ఏర్పడ్డాక డిసిసి సహకార బ్యాంకుల ద్వారా రైతులకు వడ్డీ లేని రుణాలు, గోల్డ్ లోన్, మహిళా సంఘాలకు రుణాలు అందిస్తున్నామని మారుమూల ప్రాంతాలలో రైతులకు చేరువలో ఈ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగిందని 2018 నుండి డిసెంబర్ 2023 వరకు అందరికీ రైతు ఋణ మాఫీ చేయడం జరిగిందని దీనిలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో 9 రోజులలో 9 వేల కోట్లు రైతు ఖాతాలో జమ చేశామని, క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా రైతు సంక్షేమానికి దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రైతుల యొక్క సేవలను దృష్టిలో  పెట్టుకొని ఏటూరు నాగారంలో ఈ బ్యాంకు భవనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో డిసిఓ సర్దార్ సింగ్, ఏ పి ఓ వసంత రావు, డిసిసిబి బ్యాంకు అధికారులు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు,సంబంధిత అధికారులు , తదితరులు పాల్గొన్నారు.