22-07-2025 10:09:30 PM
మంత్రి ధనసరి అనసూయ సీతక్క..
మంగపేట ములుగు (విజయక్రాంతి): రైతుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర పంచాయతిరాజ్, గ్రామీణ అభివృద్ధి, గామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క(Minister Seethakka) అన్నారు. మంగళవారం మంగపేట మండల కేంద్రంలో రైతు సేవ సహకార సంఘం లిమిటెడ్, 1000 మెట్రిక్ టన్ను నూతన గోదాం భవనంను మంత్రి ధనసరి అనసూయ సీతక్క, తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు(టెస్కాబ్) చైర్మన్ మార్నేని రవీందర్‌రావు, అదనపు కలెక్టర్ రెవిన్యూ సి హెచ్ మహేందర్ జి, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ లతో కలసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ముఖ్యంగా రైతులు మంగపేట మండలంలో కొత్త కొత్త వ్యవసాయ పరికరాలతో వ్యవసాయ రంగంలో అత్యధిక దిగుమతిని సాధిస్తున్నారని మన ములుగు నియోజకవర్గంలో ములుగు మండలం పెద్ద మండలంగా ఉండే అది మల్లంపల్లి మండలం ఏర్పడ్డాగా చిన్నగా అయిపోయిందని దాని తర్వాత మంగపేట మండలం పెద్దదని ఇక్కడ ఎక్కువ శాతం రైతులు వ్యవసాయం మిర్చి, వరి పంటలు అత్యధిక దిగుమతి ఉంటుందని అన్నారు. రైతులకు చేతికొచ్చిన పంటను నిల్వ ఉంచుకొనుటకు రైతు వ్యవసాయ నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు. రైతులకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించడానికి డిసిసి చైర్మన్, మార్కెట్ చైర్మన్, వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. అనంతరం రాజుపేట గ్రామంలో ఎఫ్‌ఎస్‌సిఎస్ షాపింగ్ కాంప్లెక్స్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిసిఓ సర్దార్ సింగ్, ఏపి ఓ వసంత రావు, ప్రజా ప్రతినిధులు, మండల అధికారులు, సంబంధిత అధికారులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.