22-07-2025 10:18:02 PM
ప్రజల శ్రేయస్సు, రైతుల సంక్షేమమే ప్రభుత్వ ఆకాంక్ష..
జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి..
చేగుంట (విజయక్రాంతి): శ్రీ మహంకాళి అమ్మ ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వ ప్రజలపై ఉండాలని కోరుకున్నట్లు రాష్ట్ర గనుల, కార్మిక శాఖ మంత్రి, మెదక్ జిల్లా ఇంచార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి(Minister Gaddam Vivek Venkataswamy) అన్నారు. చేగుంట పట్టణ కేంద్రంలో శ్రీ మహంకాళి ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు భాగంగా చేగుంట పట్టణ యువ నాయకులు సండ్రుగు శ్రీకాంత్, బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఫలహార బండి ఊరేగింపు, సాంస్కృతిక కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇంచార్జ్ నీలం మధు, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, పూజాల హరికృష్ణ, ఆవుల రాజిరెడ్డి కలిసి పాల్గొన్నారు. అనంతరం ఆలయ కమిటీ అధ్యక్షులు ఉసికే శ్రీనివాస్ ఆధ్వర్యంలో వచ్చిన అతిథులకు శాలువాతో సత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్, మండల కోఆర్డినేటర్ మల్లారెడ్డి,ఉపాధ్యక్షులు, వివిధ సంఘాల నాయకులు, నియోజకవర్గ వివిధ మండల అధ్యక్షులు, ఆత్మ కమిటీ చైర్మన్, సొసైటీ చైర్మన్లు, తాజా మాజీ సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, పట్టణ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.