21-06-2025 12:37:27 AM
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): ఈ నెల 25-30 మధ్య అన్ని ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు బేస్‌లైన్ పరీక్షను నిర్వహించనున్నారు. విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాలు తెలుసుకునేందుకు దీన్ని నిర్వహిస్తారు. ఒకటి నుంచి ఐదో తరగతుల కోసం ఎఫ్‌ఎల్‌ఎన్, ఆరు నుంచి తొమ్మిది విద్యార్థులకు ఎల్‌ఐపీ కార్యక్రమాన్ని అమలు చేస్తున్న నేపథ్యంలో పిల్లల అభ్యాసన సామర్థ్యాలను అంచనా వేస్తారు. ఈ మేరకు జిల్లా విద్యాధికారులకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేష్ ఆదేశాలు జారీ చేశారు.