19-07-2025 01:39:32 AM
డాక్టర్ల కృషితో కోలుకున్న సుష్మిత
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 18 (విజయక్రాంతి): ఓజోన్ హాస్పిటల్స్ డాక్టర్లు ఓ యువతి ప్రాణాలు రక్షించారు. సుష్మిత(21) అనే యువతి ప్రమాదవశాత్తూ 4వ అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడింది. భారీ రక్తస్రావం, తక్కువ బీపీతో ఆమె పరిస్థితి అత్యంత విషమంగా మారింది. ఓజోన్ హాస్పిటల్‌లో చేర్చగా.. అత్యవసర చికిత్సతో డాక్టర్లు ప్రాణాలను కాపాడారు. ఐసీయూలో అడ్మిట్ చేసి ప్రాణాపాయం నుంచి ఆమెను రక్షించగలిగారు.
రెండు తొడల ఎముకలు విరగడం, పెల్విస్, చేయి, మోకాలు, మడమల గాయాలకు అత్యాధునిక శస్త్రచికిత్సలు నిర్వహించారు. ఇప్పటికే కోలుకుంటున్న సుష్మితను ప్రస్తుతం జనరల్ వార్డుకి షిఫ్ట్ చేశారు. ఫిజియోథెరపీ సహాయంతో నడక సాధన చేస్తున్నది. చికిత్స అందించిన వైద్య బృందంలో ఆర్థోపెడిక్స్ డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ రాఘవ ఆదిత్య, జనరల్ సర్జన్ డాక్టర్ సురేష్‌రెడ్డి, న్యూరో సర్జన్ డాక్టర్ నిఖిల్ పల్మనాలజీ డాక్టర్ వికాస్, ఐసీయూ డాక్టర్ రాజేష్, అనస్తీషియా: డాక్టర్ విజయ్ కుమార్, ఫిజియోథెరపీ: డాక్టర్ సాయి తేజ, 8 మంది టీమ్ జనరల్ మెడిసిన్: డాక్టర్ ఇంద్రసేన్‌రెడ్డి ఎమర్జెన్సీ ఫిజిషన్: డాక్టర్ సుష్మా ఉన్నారు.