22-09-2025 12:25:23 AM
నకిరేకల్ ఎమ్మెల్యే వేముల
నకిరేకల్, సెప్టెంబర్ 21: తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని నకిరేకల్ ఎమ్మెల్యే వేము ల వీరేశం అన్నారు. ఆదివారం నకిరేకల్ పట్టణంలోని ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలకు తెలంగాణ నిలరమైతే అందుకు ప్రత్యేకంగా నిలిచేది బతుకమ్మ పండుగనారు. ప్రకృతిలో పూసిన పూలను ఆరాధిస్తూ తెలంగాణ సాంస్కృతి క వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పే పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. కుల, మత,ప్రాంతాలు విభేదాలు లేకుండా సబ్బండ వర్గాల ప్రజలు ఈ తొమ్మిది రోజుల పాటు మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారని తెలిపారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ఆడపడుచులందరికి ఎంగిలి పువ్వు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్, బి జి ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బచ్చుపల్లి గంగాధర్ ,నాయకులు కొండ వెంకన్న గౌడ్ ,లింగాల వెంకన్న, ప్రజా గాయని వేముల పుష్ప ,స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.