calender_icon.png 22 September, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కలెక్టర్ సారు.. జర చూడండి.!

22-09-2025 12:24:46 AM

  1. శిథిలావస్థలో వాటర్ ట్యాంక్

భయా  బ్రాంతులకు గురవుతున్న కాలనీ ప్రజలు 

విరిగిపోయిన పిల్లర్స్ పట్టించుకోని ఆర్ డబ్ల్యు ఎస్ 

గోపాలపేట సెప్టెంబర్ 21 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇంటింటి నల్ల ఏ ర్పాటులో నూతనంగా వాటర్ ట్యాంకులను నిర్మించారు. ఆ సమయంలోనే గత ప్రభు త్వం లో రాజకీయ నాయకులు వాటర్ ట్యాంకుల నిర్మాణాలకు టెండర్లను దక్కించుకున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో నూతనంగా వాటర్ ట్యాంకులను నిర్మాణాలు చేపట్టి పాత వాటికి సైతం రంగుల ద్దించారు.

మండలంలో పాత కొత్త ట్యాంకులతో కలిపి సదరు కాంట్రాక్టర్లు అధికారు లతో కుమ్మక్కై బిల్లులు స్వాహా అనిపించుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఇలా రేవల్లి, ఏదుల, గోపాలపేట మండలంలో ఎన్నో జరిగాయి  వనపర్తి జిల్లా గోపాలపేట మండ లం లో ఈ వాటర్ ట్యాంకులను చూస్తే అబ్బరపోతారు.

గత 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ మంచినీటి వాటర్ ట్యాంకు ద్వారానే గోపాలపేట మండల కేంద్రంలోని సుమారుగా 2 వేల మందికి తాగునీరు అందించేది. 20 ఏళ్ల క్రితం నిర్మించిన వాటర్ ట్యాంకు శిథిలావస్థకు చేరిందని గత ప్రభుత్వంలో ఉన్న అధికారులకు తెలుసు. అయినా ఆ మంచినీటి వాటర్ ట్యాంకు భగీరథ అనే పేరుతో కలర్లు వేసి బిల్లులు చేసుకున్నట్లు తెలుస్తుంది. 

ఆర్డబ్ల్యూఎస్ అధికారు లకు ఎన్నో మార్లు ఈ వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరిందని ప్రమాదంలో ఉందని పత్రికల్లో ఎన్నో మార్లు ప్రచురించిన అధికారులు మాత్రం చూసి చూడనట్లు నిర్లక్ష్యంగా ఉన్నా రే తప్ప. ఆ ట్యాంక్ ప్లేసులో మరో నిర్మాణం చేపట్టకుండా నేటికీ ఏ ట్యాంకు ద్వారానే తాగునీటిని సరఫరా చేస్తునడం పట్ల ఆంత ర్యం ఏమిటో అధికారులకే తెలియాలి. ఈ వాటర్ ట్యాంకు పూర్తిగా శిథిలావస్థకు చేరి పిల్లర్లు సైతం ఇనుప చూపులు బయటకు వచ్చాయి.

ఈ వాటర్ ట్యాంకు పూర్తిగా దెబ్బతింది. ఇటీవల కురిసిన వర్షాలకే ఈ ట్యాంకు కూలి పక్కనే ఉన్న ఇళ్లలో ఉన్న ప్రజ లు ప్రమాదానికి గురవుతారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అయినా ఏ అధికారి కూడా ఈ వాటర్ ట్యాంకుల పరిస్థితి గురించి పర్యవేక్షణ చేయలేకపోయారు.

మ రి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి కూడా రెండు ఏళ్ళు కావస్తుంది. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా కళ్ళు తెరిచి గో పాలపేట మండల కేంద్రంలో బంగారమ్మ గడ్డ రైస్ మిల్ ఎదురుగా ఉన్న వాటర్ ట్యాం క్ పరిస్థితిని పరిశీలించి దాని పురోగతి చూస్తే బాగుంటుందని కాలనీవాసులు వాపోతున్నారు.