26-09-2025 12:24:56 AM
మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని సందడి చేసిన నాయకుడు
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబరాన్ని అంటిన సంబరాలు
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో గురువారం బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పి చైర్మన్, సీనియర్ బీఆర్ఎస్ నాయకులు, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, స్థానిక నాయకులు రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి పసుపుతో గౌరమ్మను చేసి పూజలు చేశారు.అనంతరం బతుకమ్మ చుట్టూ బతుకమ్మ ఆడి పాడారు. బాన్సువాడలో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. అనంతరం బతుకమ్మలను నిమజ్జనం చేశారు.