26-09-2025 12:25:08 AM
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్ క్రైం, సెప్టెంబరు 25 (విజయ క్రాంతి): కొందరు మరణించే వరకు జీవిస్తారు, కొందరు మరణించాక కూడా జీవి స్తూనే ఉంటారని, రెండో కోవకు చెందిన గొ ప్ప వ్యక్తి, మానవతావాది పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ లో ఆయన చిత్రపటానికి కేంద్ర మంత్రి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఖాదీ వస్త్రాలను కొను గోలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ నవజ్వోల భారత మహానాయకుడు, మహోన్నతమైన ఈ శతాబ్దపు రుషి, గొప్ప రచయిత, పాత్రికేయుడు, రాజనీతిజ్ఝు డు, ఏకాత్మతా మానవతా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహోన్నతుడు దీన్ దయాల్ అని కొనియాడారు.యాడారు. దేశ రక్షణ కో సం నిరంతరం సిద్ధంగా ఉండాలని భారత సైన్యంతోపాటు జన సంఘ్ కార్యకర్తలను కూడా పాకిస్తాన్ తో జరిగిన యుద్దానికి పంపిన గొప్ప దేశభక్తుడు దీన దయాళ్ అనిపేర్కొన్నారు.
పండుగలలోపు డీలర్లకు కమీషన్ వచ్చేలా చర్యలు
కరీంనగర్ ,సెప్టెంబర్25(విజయక్రాంతి): రాష్ట్ర రేషన్ డీలర్లకు రాబోయే పండుగల లోగా కమీషన్ వచ్చేట్లు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర హోమ్ సహాయ మంత్రిబండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు కు హామీ ఇచ్చారు. రానున్న పండుగల నేపథ్యంలో 5 నెలల కేంద్ర కమీషన్ డబ్బులు ఇప్పటివరకు రానందున డీలర్లు పడుతున్న ఆర్ధిక ఇబ్బందులను కరీంనగర్ లోని ’మహాశక్తి దేవాలయంలో సంజయ్ కుమార్ ను కలసి రమేష్ బాబు సమస్యను దృష్టికి తీసుకెళ్ళారు.
బం డి స్పందిస్తూ వెంటనే కేంద్ర ఫుడ్ అండ్ ప బ్లిక్ డిస్ట్రిబ్యూషన్ శాఖ పి ఏ జె. వినోద్ కు మార్ ద్వారా కేంద్ర మంట్టిప్రహ్లాద్ జోషి ప ర్సనల్ సెక్రటరీ నగేష్, రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ రాష్ట్ర సివిల్ సప్లయ్స్ ప్రిన్సిపల్ సెక్ర టరీ(కమీషనర్) లతో ఫోన్ లో మాట్లాడగా సమస్యను పండుగల లోపు పరిష్కరించి డీలర్లకు కమీషన్ డబ్బులు చెల్లిస్తామని అధికారులు ఫోన్ ద్వారా స్పష్టం చేశారు. కార్యక్రమం లో కరీంనగర్ జిల్లా అధ్యక్షులు రొడ్డ శ్రీనివాస్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్డిమల్ల హన్మాండ్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పోతరాజు రమేష్ ,చిలగాని మోహన్ జాయింట్ సెక్రటరీ తోట సమ్మయ్య , కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి గాలి గట్టయ్య, ప్రధాన కార్యదర్శి బి.జ్యోతిరవీందర్, కోశాధికారి బి. ప్రతాపరెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు సి.బాపురెడ్డి, సిహెచ్.నరేష్,ఆర్.విజయ్, ఏ. లచ్చన్న, బి.సమత, తదితరులుపాల్గొన్నారు.