28-09-2025 12:36:31 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): అబిడ్స్, చాపల్ రోడ్ స్టాన్లీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సంబురాలు కళాశాల డైరెక్టర్ డాక్టర్ వి అనురాధ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా డా వి అనురాధ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రత్యేకతను ప్రతిబింబించే ప్రముఖమైన పండుగ బతుకమ్మ అని తెలియజేశారు.
మహిళల సౌభాగ్యాన్ని ఆయురారోగ్యాన్ని కోరుతూ జరుపుకునే ఈ పండుగలు రంగురంగుల పువ్వులతో అద్భుతంగా అలంకరించిన బతుకమ్మను మహిళ లు పాడుతూ నృత్యం చేస్తూ పూజిస్తారని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డా. బిఎల్ రాజు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ సహజ సిద్ధమైన ప్రకృతిని గౌరవించే పండుగని తెలిపారు. పూలతో బతుక మ్మను అలంకరించడం ద్వారా పర్యావరణానికి దగ్గరగా ఉండే మన సాంప్రదాయాన్ని కొనసా గిస్తున్నామని గుర్తు చేశారు. ఉత్సవాలలో కళాశాల సెక్రటరీ, కరెస్పాండెంట్ కే కృష్ణారావు, మేనేజ్మెంట్ సభ్యులు టి రాకేష్‌రెడ్డి, ఆర్ ప్రదీప్‌రెడ్డి, ప్రొ. ఏ వినయ్ బాబు, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఏ రమేష్, డైరెక్టర్ అకాడమిక్స్ డా. వైవి ఎస్‌ఎస్ ప్రగతి, డేటా సైన్స్ విభాగాధిపతి డా. కె వైదేహి విద్యార్థులు పాల్గొన్నారు.