calender_icon.png 28 September, 2025 | 1:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంప్రదాయాలకు విద్యార్థులు వారధిగా నిలవాలి

28-09-2025 12:34:48 AM

-విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ వైవీ దాసేశ్వరరావు

-యూనివర్సిటీలో బతుకమ్మ, దసరా సంబురాలు

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): విద్యార్థులు ప్రస్తుత పోటీ ప్రపంచం తో పోటీ పడుతూనే దేశ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించడానికి వారధిగా నిలవాలని విజ్ఞాన్స్ యూనివర్సిటీ డైరెక్టర్ యెం డ్లూరి వెంకట దాసేశ్వర రావు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా భూదా న్ పోచంపల్లి మండలం దేశ్‌ముఖి విజ్ఞాన్స్ యూనివర్సిటీలో శనివారం బతుకమ్మ, ముందస్తు దసరా సంబరాలు అంబరాన్నంటాయి.

ఈ సందర్భంగా వర్సిటీ డైరెక్టర్ ప్రొఫెసర్ వైవీ దాసేశ్వరరావు మాట్లాడు తూ.. “మన పండుగల్లోని విశిష్టతను, శాస్త్రీయతను విద్యార్థులు తెలుసుకోవాలన్నారు. విద్యార్థులకు సంస్కృతి సంప్రదాయాలపై గౌరవం పెంచాలనే ఉద్దేశంతో వర్సిటీలో అన్ని పండుగలు, ఇతర ప్రాము ఖ్య కార్యక్రమాలను వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలు ప్రపంచానికే మార్గదర్శకం అని యూనివర్సిటీ ఇన్టెరిమ్ డైరెక్టర్ డాక్టర్ ఎం.సుబ్బారావు అన్నారు. బతుకమ్మ, ముందస్తు దసరా సంబరాలతో విశ్వవిద్యాలయ ప్రాంగణం కొత్త కళను సంతరించు కుంది. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.